Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ ఏప్రిల్ 11 అక్షరం న్యూస్ ఏప్రిల్ 13న బీపీ మండల్ యాదవ్ వర్ధంతి మరియు గొఱ్ఱెల కాపరుల సంక్షేమ సంఘం 4వ ఆవిర్భావ దినోత్సవాన్ని యాదగిరి గుట్ట యాదాద్రి లోని లక్కీ ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరుతుందని దీనికి పెద్దపల్లి జిల్లాలో ఉన్న అఖిల భారత యాదవ మహాసభ నాయకులు ప్రజాప్రతినిధులు గొల్ల కురుమల పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షులు సాలేంద్ర రాములు యాదవ్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గొఱ్ఱెల కాపరుల ప్రస్తుత స్థితిగతులు సహకార సంఘాల నిర్వహణ సంక్షేమం పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతెన్నులపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుందన్నారు 13న ఉదయం 10గంటలకు జండా ఆవిష్కరణ వక్తల అతిధుల సందేశాలు అనంతరం జాతీయ మాంస పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలతో శాస్త్రీయ పద్ధతిలో గొర్రెల మరియు మేకల పెంపకం పై అవగాహన కార్యక్రమం వుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో బత్తిని లక్ష్మణ్ యాదవ్ దాడి చంద్రమౌళి యాదవ్ తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily