Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : " దొమ్మటి రాజేష్... పెద్దపల్లి ప్రతినిధి ఏప్రిల్ 5 అక్షరం న్యూస్; సుల్తానాబాద్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో భోజన నిర్వహణ (డైట్) కాంట్రాక్టర్ కు శుక్రవారం సాయంత్రం మెమో జారీ చేసినట్టు పెద్దపల్లి డిసిహెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు. "సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సొంత మెనూ"పేరుతో ఈనెల మూడవ తేదీన రోగులకు నిబంధనల ప్రకారం పోషక ఆహారం ఇవ్వడం లేదని, కాంట్రాక్టర్ గా వ్యవహరిస్తున్న స్వశక్తి సంఘం సభ్యురాలు బొద్దుల లక్ష్మి తన సొంత మెనూ అమలు చేస్తుందని సమగ్ర వార్త కథనం ప్రచురితమైంది. ఈ వార్తకు స్పందించిన డిసిహెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్ జీవో నెంబర్ 325 ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు మెనూ ప్రకారం ఆహారం సరఫరా ఎందుకు చేయడం లేదని, జీవోను అనుసరించి మెనూ విధిగా అమలు చేయాలని మెమో జారీ చేశారు. దీనిపై వెంటనే తమకు వివరణ ఇవ్వాలని ఆ మెమోలో కోరారు. ఇక మీదట నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
.
Aksharam Telugu Daily