Thursday, 21 May 2026 09:39:27 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

టీఆర్ఎస్ జెండా పండుగ బాధ్యుడిగా కొమురయ్య యాదవ్

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 21 May 2026 04:54 PM Views : 17

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ మే 21 అక్షరం న్యూస్ తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జెండా పండుగ వేడుకల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా ఇన్‌ఛార్జ్‌గా సలేంద్ర కొమురయ్య యాదవ్ నియమితులయ్యారు.పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా మే 20 నుండి జూన్ 20 వరకు నెల రోజుల పాటు ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరణ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధిష్టానం ఈ నియామకం చేపట్టింది.ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 33 జిల్లాలతో పాటు 119 శాసనసభ నియోజకవర్గాలకు రాష్ట్ర,జిల్లా స్థాయి పర్యవేక్షకులను,బాధ్యులను పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నియమించగా,పెద్దపల్లి జిల్లా బాధ్యతలను సలేంద్ర కొమురయ్యకు అప్పగించారు.తనపై ఎంతో నమ్మకంతో ఈ కీలక బాధ్యతను అప్పగించిన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు,తనకు సహకరించిన పార్టీ పెద్దలకు,నాయకులకు సలేంద్ర కొమురయ్య యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.తనకు ఇచ్చిన బాధ్యతలను పూర్తి శ్రద్ధతో నిర్వహిస్తూ,జిల్లాలోని పార్టీ నాయకులను,ఉద్యమకారులను కలుపుకొని సమన్వయంతో ముందుకు సాగుతానని ఆయన స్పష్టం చేశారు.ప్రతి గ్రామంలో పార్టీ జెండా గద్దెలను విజయవంతంగా నిర్వహిస్తూ,జిల్లాలో తెలంగాణ రక్షణ సేన బలోపేతానికి శాయశక్తులా కృషి చేస్తానని కొమురయ్య యాదవ్ ధీమా వ్యక్తం చేశారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :