AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / తెలంగాణ అప్డేట్స్ /అక్షరం డెస్క్ : జగిత్యాల జిల్లా/మెట్ పల్లి/జనవరి 17/అక్షరం న్యూస్: డివిజన్ లోని వేంపేట్ గ్రామానికి అదనంగా రెండు మహిళా సంఘాల భవనాలు మంజూరు అయిన సందర్భంగా స్థల పరిశీలన కోసం గ్రామానికి వచ్చిన మహిళా సంఘాల కమ్యూనిటీ కో–ఆర్డినేటర్ (సీసీ) భైరి సురేఖ ని సర్పంచ్ గోరుమంతుల ప్రవీణ్ కుమార్ ఘనంగా శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు చంద్రాచారి దశకంఠరాజు, జెల్ల శ్రీనివాస్ యాదవ్‌లు పాల్గొని సీసీని అభినందించారు. ఈ సందర్భంగా భైరి సురేఖ మాట్లాడుతూ మహిళా సంఘాల ద్వారా రుణాలు పొందుతూ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని, మహిళల అభివృద్ధి ద్వారానే గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. మహిళా సంఘాల కార్యకలాపాలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని సర్పంచ్ ప్రవీణ్ కుమార్, వార్డు సభ్యులు భరోసా ఇచ్చారు. అలాగే ప్రతి మహిళకు పథకాలపై పూర్తి అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల వీవోఏలు పల్లి విజయ, జెల్ల లాస్యలు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily