D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : . ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్/వైరా సెప్టెంబర్/8 (అక్షరంన్యూస్) మద్యం తాగి వాహనాలు నడపకండి ప్రమాదాలకు గురికాకండి అని వైరా ఎస్సై పుష్పాల రామారావు అన్నారు. సోమవారం వైరా పోలీస్ స్టేషన్ నందు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి ఎస్ఐ రామారావు కౌన్సిలింగ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని ఆ ప్రమాదాల వల్ల ఎంత నష్టం జరుగుతోందొ ఒకసారి ఆలోచించండి ,ఏదైనా జరిగితే మీ కుటుంబం ఎలాంటి నష్టపోతాదో అదే విధంగా ప్రమాదంలో ఎదుటి వారికి కూడా ఏదైనా జరిగితే వారి కుటుంబం ఎంత నష్టపోతుందో ఆలోచించాలి , మద్యం తాగి డ్రైవ్ చేయొద్దు అని ఆయన వారికి సూచించారు, ఇటీవల కాలంలో మద్యం మత్తులో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారిని జరిమానా చెల్లించే విధంగా లోకదాలతో పరిష్కరించుకునేందుకు మధిర పంపించడం జరిగింది అన్నారు. ప్రతి ఒక్కరూ వాహనాలు తోలేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని జాగ్రత్తలు లేకపోతే జరిగే ప్రమాదాల వల్ల మనం ఎంతో నష్టపోతామని ఎస్సై రామారావు తెలిపారు.
.
Aksharam Telugu Daily