D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/తల్లాడ అక్టోబర్ 26 (అక్షరం న్యూస్) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పాలేరు నియోజకవర్గ స్థాయి సన్నాహకసమావేశానికి ముఖ్య అతిథిలుగా విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి,పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి కు ఘన స్వాగతం పలికి, శాలువాలతో సత్కరించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ పాలేరు నియోజక వర్గంలో ప్రతి మండలంలో,ఈదులాపురం మున్సిపాలిటీలో పట్టభద్రుల ఓటు నమోదు కేంద్రాలు పెట్టామని పట్టభద్రులు ఈ అవకాశాన్ని వినియోగించి కావాలని కోరారు, ఈ సందర్భంగా తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐలూరి వెంకటరామిరెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్ రెడ్డి సర్వోతిరెడ్డిని మర్యాదపూర్వం కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు అందరు సమిష్టిగా శ్రమించి పట్టభద్రుల ఓటు నమోదు ప్రక్రియలో భాగస్వాములు కావాలని శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.తద్వారా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓట్లు అధిక సంఖ్యలో పడేలా చేసి వారి గెలుపుకు బాటలు వేయాలని, శ్రేణులు అందరు కష్టపడి పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily