Sunday, 29 March 2026 03:27:34 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

రెండవ వార్డులో దూసుకుపోతున్న బీఆర్‌ఎస్ అభ్యర్థి రెండ్ల రమ్య నాగరాజు


DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.

Reporter

Date : 06 February 2026 05:18 PM Views : 289

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి, ఫిబ్రవరి 6 (అక్షరం న్యూస్): పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డు శాంతినగర్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ తరఫున బరిలోకి దిగిన అభ్యర్థి రెండ్ల రమ్య నాగరాజు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. కార్యకర్తలు, అనుచరులతో కలిసి ఇంటింటా తిరుగుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటిని సందర్శిస్తూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటూ, తనను గెలిపిస్తే వార్డు అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇస్తున్నారు. తాగునీరు, డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాలు, పారిశుధ్యంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తానని వివరించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి అర్హుడికి అందేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా పనిచేస్తానని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో మంచి స్పందన వ్యక్తమవుతోందని, రెండవ వార్డులో తమ అభ్యర్థికి అనుకూల వాతావరణం నెలకొందని పార్టీ నాయకులు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :