P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి జనవరి 13 (అక్షరం న్యూస్) ఓదెల మండలంలోని కొలనూరు సమ్మక్క సారలమ్మ వనదేవతల. గద్దెల సమీపంలో ఎస్సై దికొండ రమేష్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలు, ప్రాణ నష్టాలను తగ్గించాలనే సంకల్పంతో పోలీసు శాఖ ‘అరైవ్.. అలైవ్’ ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి భారీ ర్యాలీ తీశారు ఈ సందర్భంగా ఎస్సై దికొండ రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు, ప్రాణ నష్టాలను తగ్గించాలనే సంకల్పంతో పోలీసు శాఖ ‘అరైవ్.. అలైవ్’ ప్రచార కార్యక్రమాన్ని చేపడుతోంది. రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఈ కార్యక్రమాన్ని ఈరోజు కొలనూరు గ్రామంలో నిర్వహించడం జరిగిందని ఈ నేపథ్యంలో ప్రజల భాగస్వామ్యంతో రోడ్డు ప్రమాదాలను, మరణాలను తగ్గించడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. రోడ్డు భద్రత ప్రాముఖ్యతను ప్రతి పౌరుడి మనసులో బలంగా నాటేందుకే అరైవ్ అలైవ్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమం ద్వారా ప్రజలకు సురక్షిత డ్రైవింగ్ సంస్కృతిని అలవాటు చేసి, రోడ్డు భద్రతా వ్యవస్థలను పటిష్ఠం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. విద్యార్థులు, ప్రముఖులు, మీడియా, ప్రజాప్రతినిధులు, అన్ని ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో రోడ్డు భద్రతలో తెలంగాణను దేశానికే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నది తమ ధ్యేయమని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం, కార్లలో సీటు బెల్టులు పెట్టుకోకపోవడం, వాహనం నడుపుతూ సెల్‌ఫోన్ వాడడం, మద్యం సేవించి నడపడం, సిగ్నల్ జంప్, స్టాప్ లైన్ దాటడం, హైవేలపై ఆటోల ఓవర్ లోడింగ్, ఎడమవైపు నుంచి ఓవర్ టేకింగ్ వంటి ప్రమాదకర అలవాట్లపై ఈ ప్రచారంలో ప్రత్యేక దృష్టి పెట్టామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సమ్మక్క సారక్క జాతర కమిటీ చైర్మన్ కొలిపాక మదినయ్య ముదిరాజ్ . బిజెపి జిల్లా అధ్యక్షుడు కర్ర సంజీవరెడ్డి కొలనూరు సర్పంచి కనకయ్య గోపాలపల్లి సర్పంచ్ మద్యవేన రవి జైపాల్ రెడ్డి గోపు నారాయణరెడ్డి ఐరెడ్డి వెంకటరెడ్డి గార వేణు నాగరాజు కారంగుల శ్రీనివాస్ బొంగోని రాజయ్య గౌడ్ కొంచెం మల్లయ్య కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బైరి రవి గౌడ్ నాయకులు జయపాల్ రెడ్డి బిక్షపతి గంట రమేష్ కాసర్ల ఐలయ్య గౌడ్ కొల్లూరు చందు సాతూరి రాజేశం తోపాటు తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily