Monday, 20 April 2026 07:15:55 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

వైరాలోనే ఆర్టీవో కార్యాలయాన్ని కొనసాగించాలి... ఆర్టీవో కార్యాలయం వద్ద సిపిఎం(ఎం) నిరసన .. బోనకల్‌కు మార్చితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.. సీపీఐ(ఎం)

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 09 January 2026 05:49 PM Views : 201

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జి దినేష్ కు వినతి.. ఖమ్మం/స్టాఫ్ రిపోర్టర్ జనవరి 9 వైరా (అక్షరం న్యూస్) వైరా, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాలకు విశేషంగా సేవలు అందిస్తున్న వైరా ఆర్టీవో కార్యాలయాన్ని వైరా నియోజకవర్గ కేంద్రంలోనే కొనసాగించాలని సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భుక్యా వీరభద్రం డిమాండ్ చేశారు. వైరా ఆర్టీవో బోనకల్ కు మార్చితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. శుక్రవారం ఆర్టీవో కార్యాలయాన్ని బోనకల్ కు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ ఆర్టీవో కార్యాలయం వద్ద సిపిఐ(ఎం) వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జి.దినేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు . ఈ సందర్భంగా పార్టీ వైరా డివిజన్ కార్యదర్శి భుక్యా వీరభద్రం మాట్లాడుతూ గత 27 సంవత్సరాలుగా వైరా కేంద్రంగా ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే విధంగా సేవలందిస్తున్న రవాణా శాఖ కార్యాలయాన్ని వైరా నుంచి మధిర నియోజకవర్గం బోనకల్‌కు మార్చాలనే ప్రభుత్వ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. వైరాలో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా కార్యాలయాన్ని బోనకల్ కు తరలించడాన్ని సిపిఐ(ఎం) పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. నిర్ణయం వల్ల వైరా, కొణిజర్ల, తల్లాడ, ఎన్కూరు మండలాల ప్రజలకు రవాణా సేవలు అందనంత దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బోనకల్ మండల కేంద్రంలో ఆర్టీవో కార్యాలయం ప్రారంభించేందుకు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఆదేశాల మేరకు గురువారం బోనకల్ మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయం వెనుక ఉన్న స్థలాన్ని వైరా ఎంవిఐ వరప్రసాద్, తహసిల్దార్ రమాదేవి, యుడిసి ఉపేందర్ పరిశీలించారని తెలిపారు. బోనకల్ కు కొత్త ఆర్టీవో కార్యాలయం మంజూరు చేయాలని సూచించారు. వైరాలో ఉన్న రవాణా శాఖ కార్యాలయాన్ని వైరాలోనే కొనసాగించాలని కోరారు. బోనకల్ కు మార్చడం వల్ల వేలాది మంది ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని, ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా తీసుకుంటున్న నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని, లేదంటే ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, రూరల్ కార్యదర్శి బాణాల శ్రీనివాసరావు, డివిజన్ కార్యదర్శివర్గ సభ్యురాలు మచ్చా మణి, నాయకులు గుడిమెట్ల రజిత, పైడిపల్లి సాంబశివరావు, గుడిమెట్ల మోహన్ రావు, కొంగర సుధాకర్, షేక్ నాగుల్ పాషా, తోట కృష్ణవేణి, మందడపు రామారావు, మల్లెంపాటి ప్రసాదరావు, మాడపాటి రామారావు,యనమద్ది రామకృష్ణ, అమరనేని కృష్ణ, పానుగంటి రాంబాబు, మాడపాటి వెంకటేశ్వరరావు, మాడపాటి సుజాత, చావా కళావతి తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :