Sunday, 29 March 2026 03:28:41 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

పాముకు కోరల్లో విషం.. విపక్షానికి ఒంటి నిండా విషమే.. మున్సిపల్ ఎన్నికల్లోనూ డిపాజిట్లు గల్లంతు కావాలి : మంత్రి పొంగులేటి 69 శాతం పంచాయతీల స్ఫూర్తితో

​మద్దులపల్లి వేదికగా రూ. 361.55 కోట్ల అభివృద్ధి పనులకు ‘సీఎం రేవంత్’ శ్రీకారం..


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 18 January 2026 03:40 PM Views : 550

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : .. ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 18 (అక్షరం న్యూస్) ఖమ్మం : "పాముకు కేవలం కోరల్లోనే విషం ఉంటుంది.. కానీ పదేళ్లపాటు రాష్ట్రాన్ని దోచుకుని, అప్పుల పాలు చేసిన ఆ నాయకులకు ఒంటి నిండా విషమే ఉంది. వారు చేసిన పాపాలు బయటపడతాయనే భయంతో ప్రజా ప్రభుత్వంపై నిత్యం విషం కక్కుతున్నారు" అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం మద్దులపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపిన ఆయన, విపక్షాల తీరును ఎండగట్టారు. - *​ప్రజా తీర్పుతో చెంప చెళ్లుమంది!* ​అసెంబ్లీ, పార్లమెంటు, కంటోన్మెంట్ బై ఎలక్షన్లలో ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్‌కు పట్టం కట్టారని పొంగులేటి గుర్తు చేశారు. "సెమీ ఫైనల్స్ అని కారుకూతలు కూస్తున్న చిచ్చర పిడుగులకు, టిల్లూలకు మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 69 శాతం గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ గెలుచుకోవడం మా ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన రెఫరెండం. ఇదే జోరు మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగాలి. ఉమ్మడి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లో ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేసి, కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి" అని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. - *​వృథా జలాలకు అడ్డుకట్ట.. సాగుకు భరోసా* ​జిల్లా ప్రగతిలో సాగునీటి ప్రాజెక్టులు చారిత్రక మైలురాయిగా నిలుస్తాయని మంత్రి పేర్కొన్నారు. రూ. 162.54 కోట్లతో నిర్మించే మున్నేరు-పాలేరు లింక్ కెనాల్ ద్వారా 1.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని వివరించారు. రూ. 108.60 కోట్లతో జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల, రూ. 45.50 కోట్లతో కూసుమంచిలో 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణాలకు శ్రీకారం చుట్టడం జిల్లా యువతకు, పేదలకు వరమని కొనియాడారు. - *​కార్యకర్తలే నా బలం..* ​తమను గెలిపించడానికి అహోరాత్రులు శ్రమించిన కార్యకర్తలను ప్రజాప్రతినిధుల స్థానంలో కూర్చోబెట్టే బాధ్యత తమదేనని మంత్రి భరోసా ఇచ్చారు. "మీ కష్టాన్ని నేను మరువను. పేదవాడికి భద్రత, భరోసా కల్పించడమే ధ్యేయంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో మా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా అభివృద్ధి ఆగదు" అని స్పష్టం చేశారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :