D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ వైరా టౌన్ అక్టోబర్ 21 (అక్షరం న్యూస్) వైరా మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన 6 టు 6 క్రికెట్ టోర్నమెంట్ మూడు రోజులు పాటు నిర్వహించారు బుధవారం క్రికెట్ పోటీల్లో గెలిచిన టీం లకు బహుమతి ప్రధానోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సమక్ తక్రా జిల్లా అధ్యక్షులుడాక్టర్ కాపా మురళీకృష్ణ స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ పుష్పాల రామారావు విచ్చేసి వారు మాట్లాడుతూ మన భారతదేశం ఆట క్రికెట్ కాకున్నా భారతీయులందరూ అతిగా ఇష్టపడేట క్రికెట్ అని ఈ క్రికెట్ తో పాటు అనేకమైన ఆటలు యువకులు ఆడటం వల్ల మనిషి శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి ఆటలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు యువకులందరూ కలిసి క్రికెట్ టోర్నమెంట్లో ఆనందంగా కలిసి పాల్గొన్నారని వారు తెలిపారు యువతలో క్రీడాస్ఫూర్తినిపెంపొందించడంతోపాటు ఆరోగ్యం పై కూడా అవగాహన కల్పించుకోవాలని అన్నారు క్రీడలు ధ్యానం ద్వారా ఒత్తిడి ఆందోళన ఇతర అనారోగ్య సమస్యలు అధిగమించవచ్చని తెలిపారు యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడలను జీవితంలో భాగం చేసుకోవాలని వారి పేర్కొన్నారు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కూడా కలిగిస్తాయని వారి సందర్భంగా తెలిపారు అనంతరం గ టోర్నమెంట్లో లో గెలిచిన టీమ్లకు బహుమతులను అందించారు 6టూ 6 క్రికెట్ టోర్నమెంట్ మొదటి బహుమతి షీల్డ్ ను మణుగూరు టీం రెండో బహుమతిని కాప రాయల్ టీం మూడో బహుమతిని గణేష్ టీం గెలుచుకుంది ఈ బహుమతులను మొదటి బహుమతి వైరా మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణ రెండో బహుమతి 20 వ వార్డ్ కౌన్సిలర్ వుండ్రు. వరలక్ష్మీ శ్యాంబాబు మూడవ బహుమతిని కాంగ్రేస్ నాయకులు పెరుగు ప్రసాద్ ఆల్ రౌండర్ గా ఎన్నికైన క్రికెటర్ కు బహుమతిని 2 వార్డ్ కౌన్సిలర్ తిరుపతి శివ కుమారి శ్రీను అందించారు ఈ బహుమతి ప్రధానోత్స కార్యక్రమంలో , పొదిలి హరినాథ్ , తోటకూర శ్రీకాంత్ . ఉయ్యూరు రామకృష్ణ పెనుగొండ ఉపేందర్ రావ్ వాంకుడోత్యా బిక్య ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ కమిటీ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily