Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : *. *ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ మే/ 13 వైరా (అక్షరంన్యూస్ )* లయన్స్ క్లబ్ ఆఫ్ వైరా అనే ఒక స్వచ్చంద సంస్థ ద్వారా 2009లో ప్రారంభించి మారుమూల గ్రామీణ ప్రాంతాలలో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి, ఇప్పటి వరకు 40,000 వేల కంటి ఆపరేషన్లు నిర్వహించడం జరిగింది. ఈ హాస్పిటల్ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా, వరంగల్ మరియు పక్క రాష్ట్రం అయిన ఏపీ నుండి కూడా అనేక వేల మంది నిరంతరం వైద్య సేవలు పొందుతున్నారు. ఈ హస్పిటల్ ద్వారా ముగ్గురు క్యాలిఫైడ్ డాక్టర్స్, 20 మంంది సిబ్బందితో అతి తక్కుల ఫీజుతో మరియు అతి తక్కువ ఖర్చుతో కొంత మందికి పూర్తి ఉచితంగా కంటి వైద్య సేవలు అందించడం జరుగుతుంది. మా సంస్థ తరపున ఉచితంగా కుట్టు మిషన్లు, తోపుడు బండ్లు, వీల్ ఛైర్లు, ఫ్రిజర్ బాక్సులు, ల్యాప్టాప్లు అందించడం జరుగుతుంది. ఉచిత సేవలతో పాటు ఇన్ని వేల ఆపరేషన్లు నిర్వహించేటప్పుడు బీ.పీ, షుగర్, గ్లాకామా పేషంటికి సహజంగానే చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. వైరాలో ఉన్న ఏకైక స్వచ్చంద సంస్థ మరియు ఉచిత కంటి చికిత్స నిర్వహించే సంస్థ కూడా మాదే. దానిని ఆధారంగా చేసుకోని అక్షిత అనే పేపర్ ద్వారా మా మీద చెడు రాతలు రాస్తూ డాక్టర్ని బ్లాక్మెయిల్ చేస్తూ చెడు ప్రచారం చేస్తున్నారు. గతంలో కూడా ఇదే వ్యక్తి వేరే హాస్పిటల్ మీద కూడా చెడు రాతలు రాస్తూ డాక్టర్ని భయభ్రాంతులకి గురి చేస్తున్నారు. మాకు మీడియా మీద అపారమైనటువంటి గౌరవం, నమ్మకం కూడా ఉంది. ఇటువంటి వైరాతో సంబంధం లేని తల్లాడ మండలానికి చెందిన చలపతి గౌడ్ అను వ్యక్తి 2 పేపర్లను ఆసరా చేసుకోని డాక్టర్ల మీద చెడు ప్రచారం చేస్తున్నారు. ఈ అక్షిత పేపర్ ప్రభుత్వ గుర్తింపు ఉందా లేదా అని ఆరా తీయగలరు. అక్షిత తప్పుడు కథనాలు రాయడం ద్వారా మా హస్పిటల్ ఇమేజ్, ప్రతిష్ట దెబ్బతింటున్నాయి. మా హస్పిటల్ ద్వారా అనేక మంది వైద్యులు కూడా మా దగ్గర శిక్షణ పొందుతున్నారు. ఇటువంటి మంచి పేరున్న సంస్థ మీద కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. మా హస్పిటల్ గురించి నిజానిజాలు తెలియాలంటే ప్రజలలో ఆరా తీయగలరు. దయచేసి ఆ వృత్తి మీద తగు చర్యలు తీసుకోని మమ్మల్ని ఆ వ్యక్తి బారి నుండి కాపాడగలరని పోలీస్ స్టేషనచేశార లయన్స్ క్లబ్ సభ్యులు ఫిర్యాదు చేశారు.
.
Aksharam Telugu Daily