Monday, 21 September 2026 04:01:06 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

సాదిరెడ్డి పల్లి పాఠశాల ను నిర్వీర్యం చేయొద్దు గ్రామస్థుల నిరసన కు - తుడుందెబ్బ మద్దతు

.


D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT.

Reporter

Date : 20 September 2026 07:03 PM Views : 153

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా/ కొత్తగూడ/ సెప్టెంబర్ 20(అక్షరం న్యూస్ ) మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం సాధిరెడ్డి గ్రామం లో గల గిర్జన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల లోని ఉపాధ్యాయు లని అక్రమంగా, డిప్యూటేషన్ చేస్తూ పాఠశాలలో ని విద్యార్థులకు విద్యా అందకుండా చేసి పాఠశాలను మూసివేయడం కోసం కుట్రచేయడం సబబు కాదని ఉపాధ్యాయుల తరలింపు ను నిలిపివేయాలని ఈ రోజు గ్రామస్థులు పాఠశాల ఆవర్నములో నిరసన కార్యక్రమం ను చేశారు సాదిరెడ్డి పల్లి NYC అధ్యక్షులు ఈక శ్రీధర్ మాట్లాడుతూ గిర్జన సంక్షేమ అధికారులు పాఠశాలను పట్టించుకోకుండా ఉండటం తో పాటు సరైన వసతి సౌకర్యాలు లేక ప్రస్తుతం ఉన్న విద్యార్థులు భయానక వాతావర్ణం లో బిక్కు బిక్కు మంటూ చదువులు కొనసాగిస్తున్నారని,ఈ పాఠశాలకు బిల్డింగ్ సాంక్షన్ అయి సంవత్సరం గడుస్తున్నా ఇప్పటికి నిర్మాణం చేపట్టక పోవడం చాలా విచారంగా ఉందని పాఠశాల ఆవరనము అంతా గడ్డి, పిచ్చి మొక్కలతో నిండి అపరిశుభ్రంగా ఉందని, కనీసం ప్రహరీ గోడ కూడ లేక పోవడం బాధ కరంగా ఉందని శానిటేషన్ కూడ చేయడం లేదని,వంట గది సైతం లేకపోవడం బాధాకరంగా ఉందని,అన్నారు అదేవిధంగా తుడుందెబ్బ జిల్లా సమన్వయ కర్త ఆలూరి రాజు మాట్లాడుతూ, ఒకప్పడు ఈ పాఠశాల లో వందలాది మంది విద్యార్థులు ఉండేదని ఈ పాఠశాల ను అధికారులు నిర్లక్ష్యం చేయడం మూలంగానే ఇలాంటి పరిస్థితి దాపురించి ఉండదని ఈ యొక్క పాఠశాలను విద్యార్థుల శాతం తక్కువ ఉందనే సాకుతో పాఠషాలను మూసి వేసేందుకు టీచర్స్ ను ఒకొక్కరిగా డిప్యూటేషన్ చేస్తున్న అధికారులారా తక్షణమే ఈ తప్పుడు విధానము ను మానుకోవాలని ఇట్టివ విషయం లో జిల్లా కలెక్టర్, ఐటీడి ఏ పీవో గార్లు స్పందించి పాఠశాల పట్ల శ్రద్ద చూపాలని,లేకుంటే దశల వారీగా ఆందోళన చేస్తామని డెప్యూటేషన్ పై పంపిన ఉపాధ్యాయులను తిరిగి పాఠశాలకు పంపించాలని, ఇట్టి విషయం లో మంత్రి సీతక్క గారు చొర్వ చూపి పాఠశాలను కాపడాలని తమ నియోజక వర్గంలో ని ఈ పాఠషాలకు మంజూరి అయిన బెల్డింగ్ లని నిర్మాణం చూపించే దిశగా ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు, కార్యక్రమం లో మండల అధ్యక్షులు ఈక విజయ్ కుమారు, మాజీ సర్పంచ్ పులషం పాపయ్య, ఆలూరి కిరణ్ కుమార్, ఆలూరి వంశీ పటేల్, వాసం నాగయ్య, ధనుసరి సారంగా పానీ, బంగారు చరణ్, ఈగం యాకయ్య, ధనుసరి సమ్మయ్య, వట్టం సారయ్య, లు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :