AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/ చర్ల ఆగస్టు 21/అక్షరం న్యూస్/----సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గిరిజన గ్రామం కిష్టారంపాడు లో డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామం లోని గిరిజనులందరికీ వైద్య పరీక్షలు ఇద్దరికీ జ్వరం లక్షణాలు ఉండడంతో వారికి ఆర్ డి టి పరీక్షలు చేసి మలేరియా జ్వరం కాదు మామూలు జ్వరం అని గుర్తించి మందులు ఇచ్చారు. అనంతరం డాక్టర్ నగేష్ గిరిజనులతో మాట్లాడుతూ జ్వరాలు వేస్తే అశ్రద్ధ చేయకుండా పీహెచ్సీ కి రావాలని ఆయన అన్నారు. పి హెచ్ సి లో అన్ని రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. సురక్షితమైన సుఖప్రసవం కొరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తప్పకుండా రావాలని గర్భిణీ మహిళలకు సూచించారు. చిన్నపిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు తప్పకుండా వేయించాలన్నారు. వర్షాకాలం కాబట్టి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నీళ్లు నిలవ లేకుండా చూసుకోవాలని దోమ తెరలను వినియోగించుకోవాలని ఎల్లప్పుడూ పరిశుభ్రమైన నీటినే తీసుకోవాలంటూ సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలపై గిరిజనులకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఈ ఓ బాబురావు హెల్త్ అసిస్టెంట్ సుబ్బారావు వేణు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily