AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల సెప్టెంబర్ 30/ అక్షరం న్యూస్/------ పూల పండుగతో తెలంగాణలోని ప్రతి పల్లెలు వాడ వాడలు కళకళలాడుతున్నాయి. ఎక్కడ చూసినా బతుకమ్మ పాటలే. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మ సంబరాలలో మండలంలోని ప్రతి పల్లెలలో వాడలలో సందడి నెలకొంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పట్టుకొమ్మ గా నిలిచిన బతుకమ్మ పండుగలో చివరి ఘట్టమైన సద్దుల బతుకమ్మ సందడి అంతా ఇంతా కాదు. బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకాయి. మండలంలోని ఊరు వాడలు పూలవనాలుగా మారాయి. పెత్రామాస నుంచి దుర్గాష్టమి వరకు తీరొక్క పూలతో బతుకమ్మను పేరుస్తూ మహిళలు ఆడుతారు. బతుకమ్మ వేడుకలలో ప్రతిరోజు ఓ ప్రత్యేకత రోజుకో ప్రత్యేకమైన నైవేద్యాన్ని గౌరమ్మ తల్లికి సమర్పిస్తారు. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన సంబరాలు నేడు సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి. మిగతా రోజుల కన్నా భిన్నంగా ఈరోజు పెద్ద పెద్ద బతుకమ్మలు పేరుస్తారు. సాయంత్రం కాగానే పిన్నలు పెద్దలు ముసలిముక్క అందరూ అందంగా ముస్తాబై ఊరంతా తాలిపేరు నదికి ఊరేగింపుగా తరలి వెళ్తారు. తంగేడు పూల చందమామ.. బతుకమ్మ పోతుంది చందమామ.. పోతేపోతివి గాని చందమామ... మళ్ళెపుడోస్తావు చందమామ.. ఏడాదికోసారి చందమామ.. నువ్వోచ్చి పోవమ్మ చందమామ.. అంటూ తమకు బతుకునిచ్చిన పరమేశ్వరికి ఘనంగా వీడ్కోలు పలుకుతారు.
.
Aksharam Telugu Daily