D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : .. ఖమ్మం/స్టాఫ్ రిపోర్టర్ అక్టోబర్ 13 (అక్షరం న్యూస్) మైనర్ బాలబాలికలు కనిపించకుండా పోయిన కేసులను పోలీసులు అత్యంత సీరియస్‌గా తీసుకోవాలని, ప్రతి కేసులో తక్షణమే స్పందించి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పోలీస్ కాన్ఫిరెన్స్ హాల్లో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ..మైనర్ మిస్సింగ్ ఫిర్యాదు అందిన వెంటనే కేసు తీవ్రతను గుర్తించి, ఆలస్యం చేయకుండా చట్టప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలని సూచించారు. మిస్సింగ్ అయిన బాలబాలికల ఆచూకీ గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలు, మొబైల్ ఫోన్ సమాచారం, ఇతర అందుబాటులో ఉన్న ఆధారాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు. బాలబాలికలు ప్రమాదంలో ఉన్నారనే అనుమానం ఉన్నప్పుడు తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టాలని, మానవ అక్రమ రవాణా, కిడ్నాప్ వంటి కోణాల్లోనూ కేసు పరిస్థితులకు అనుగుణంగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుంటూ మైనర్ల ఆచూకీని త్వరితగతిన గుర్తించేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి మైనర్ మిస్సింగ్ కేసు పురోగతిని ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, దర్యాప్తులో నిర్లక్ష్యం వహించే అధికారులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నేరాల నియంత్రణలో పోలీసులకు సహకరిస్తూ సురక్షిత సమాజ నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.కాలనీలు, అపార్ట్‌మెంట్లు, ప్రధాన రహదారులు, వ్యాపార సముదాయాలు, దుకాణాలు, రద్దీ ప్రాంతాల్లో ప్రజలు, వ్యాపారుల భాగస్వామ్యం తో సీసీ కెమెరాల ఏర్పాటుతో ప్రజా భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని అన్నారు. ముఖ్యంగా రహదారులు, ప్రవేశ ద్వారాలు, బయటకు వెళ్లే మార్గాలు స్పష్టంగా కనిపించేలా కెమెరాలను అమర్చుకోవాలని తెలిపారు. ప్రజలు తమ ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, ఏర్పాటు చేసిన కెమెరాలు నిరంతరం పనిచేసేలా నిర్వహణ చేపట్టాలని సూచించారు. ప్రజల భద్రత, నేరాల నివారణ కోసం జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు నిరంతరం కొనసాగాలని, ప్రధాన రహదారులు, కూడళ్లు, ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రత్యేక వాహనాల తనిఖీలు చేపడుతూ ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర వాహనాల పత్రాలను పరిశీలించాలని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై నిఘా ఉంచుతూ అక్రమ రవాణా, నిషేధిత మాదకద్రవ్యాల సరఫరా, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ తదితర అవసరమైన పత్రాలను తమ వెంట ఉంచుకోవాలని సూచించారు. ప్రజల భద్రత, నేరాల నివారణ కోసం జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు నిరంతరం కొనసాగాలని, ప్రధాన రహదారులు, కూడళ్లు, ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రత్యేక వాహనాల తనిఖీలు చేపడుతూ ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర వాహనాల పత్రాలను పరిశీలించాలని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై నిఘా ఉంచుతూ అక్రమ రవాణా, నిషేధిత మాదకద్రవ్యాల సరఫరా, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ తదితర అవసరమైన పత్రాలను తమ వెంట ఉంచుకోవాలని సూచించారు. మహిళల భద్రత, స్వీయరక్షణపై ఉమేన్ సేఫ్టీ విభాగం, షీటీమ్ బృందాల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ.. మహిళలు, బాలికలు ఎలాంటి భయం లేకుండా విద్య, ఉద్యోగ, ఇతర రంగాల్లో ముందుకు సాగేందుకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందన్నారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఏసీపీలు రమణమూర్తి, తిరుపతి రెడ్డి, సారంగపాణి, శ్రీనివాసులు, మహేష్, సర్వర్, సత్యనారాయణ, నర్సింహారావు,సాంబరాజు,సుశీల్ సింగ్, ఏవో కళావతి పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily