D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * ఖమ్మం/కొనిజర్ల నవంబర్ 9 (అక్షరం న్యూస్) *కొనిజర్ల నూతన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గా డి. హరిత బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సోమవారం వైరా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎస్సైను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి స్వీట్లు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దేవబత్తిని సీతారాములుమాట్లాడుతూ కొనిజర్ల మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి నూతన ఎస్సై కృషి చేయాలని ఆకాంక్షించారు. పోలీస్ - ప్రెస్ మధ్య సమన్వయంతో పనిచేస్తే ప్రజలకు మంచి జరుగుతుందని తెలిపారు. నూతన ఎస్సై హరిత మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ చట్టపరంగా మండలంలో నేరాల నియంత్రణకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ గౌరవాధ్యక్షులు ఓర్సు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి షేక్ షాకీర్, ఉపాధ్యక్షులు వాకదాని శ్రీకాంత్, గొడ్ల నరసింహారావు, తుప్పతి రవికుమార్ ఉన్నారు.*
.
Aksharam Telugu Daily