D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం /స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్12 (అక్షరంన్యూస్) త్రైమాసిక తనిఖీల్లో భాగంగా కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ఈ.వి.ఎం. గోడౌన్ ను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి శుక్రవారం తనిఖీ చేశారు. ముందుగా ఈవిఎం గోడౌన్ సీల్ ను పరిశీలించి రాజకీయ ప్రతినిధులు, అధికారుల సమక్షంలో సీల్ తీసి లోపలికి వెళ్లి, ఈ.వి.ఎం., వి.వి.ప్యాట్లు ఉన్న గది లోపల పరిశీలన చేసి తిరిగి సీల్ వేయించారు. ఫైర్ అలారం పరిశీలించారు. అగ్నిమాపక యంత్రాలు కండీషన్ పర్యవేక్షణ చేయాలన్నారు. మొదటి అంతస్తులో స్లాబ్ ను పరిశీలించి, నీరు నిల్వకుండా వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. వర్షపు నీరు ఎక్కడ నిల్వ వుండొద్దని, పడ్డ నీరు వెంటనే వెళ్లిపోయేలా డ్రైయినేజి వ్యవస్థ ఉండాలన్నారు. తనిఖీ రిజిస్టర్ లో జిల్లా కలెక్టర్ సంతకం చేసి, మాట్లాడుతూ, సీసీ కెమెరాల పని తీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సెక్యూరిటీ గార్డ్ కు తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకులు ఎం.ఏ. రాజు, కలెక్టరేట్ ఎన్నికల డిటి అన్సారీ, రాజకీయ పార్టీ ప్రతినిధులు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి పి. శ్రీనివాస్, బిజేపి పార్టీ ప్రతినిధి జి. విద్యాసాగర్, సి.పి.ఐ.(ఎం.) పార్టీ ప్రతినిధి ఎస్. నవీన్ రెడ్డి, బి.ఆర్.ఎస్. పార్టీ ప్రతినిధి ఎల్. సతీష్, టి.డి.పి. పార్టీ ప్రతినిధి పి. కృష్ణప్రసాద్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఏ. గోపాల్ రావు, బిఎస్ పి పార్టీ ప్రతినిధి సిహెచ్. నాగేశ్వరరావు, అధికారులు, తదితరులు ఉన్నారు.
.
Aksharam Telugu Daily