Friday, 17 April 2026 04:09:17 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

తెలంగాణ అస్తిత్వంపై బీజేపీ దాడి.. తేజస్వి సూర్య తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలి : ఎన్ ఎస్ యు ఐ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ మిడిదొడ్డి భాను కుమార్

.


GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLA

Reporter

Date : 17 April 2026 12:34 PM Views : 89

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /ఏప్రిల్ -17(అక్షరం న్యూస్ ) పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై భారతీయ జనతా పార్టీ నాయకులు మరోసారి తమ ద్వేషాన్ని వెళ్లగక్కారని, ఆ పార్టీ నేతలకు తెలంగాణ అస్తిత్వంపై గౌరవం లేదని తెలంగాణ ఏర్పాటును భారత్-పాక్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలు అమరవీరుల త్యాగాలను, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తీవ్రంగా కించపరచడమేనని ఎన్ ఎస్ యు ఐ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ మీడిదొడ్డి బాను కుమార్ తీవ్రంగా ఖండించారు. 1200 మంది విద్యార్థుల బలిదానాలతో, సుదీర్ఘ ప్రజాస్వామ్య పోరాటం ద్వారా సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని మత విద్వేషాల కారణంగా జరిగిన దేశ విభజనతో పోల్చడం బీజేపీ అజ్ఞానం, విద్వేషపూరిత వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు.తెలంగాణలో ఓట్లు అడుగుతున్న బీజేపీ నేతలు, ఢిల్లీలో రాష్ట్ర గౌరవాన్ని అవమానిస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు.నియోజకవర్గాల పునర్విభజన పేరిట దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం పోరాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై విమర్శలు చేయడం అంటే తెలంగాణ ప్రజలను అవమానించడమేనని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వెంటనే తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :