GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/రామగిరి : (పెద్దపల్లి జిల్లా) ఏప్రిల్ 13 అక్షరం న్యూస్ : కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ జిల్లా అధ్యక్షునిగా మాడూరి వినోద్ కుమార్ ఎన్నికయ్యారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సిరి పంక్షన్ హాల్ లో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ జిల్లా ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ పదవులకు ఆదివారం ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికలో అధ్యక్ష పదవీకి ఎల్. బిక్షపతి, ఎం. వినోద్ కుమార్ పోటీ పడగా, వినోద్ కుమార్ 346 ఓట్లు, బిక్షపతికి 1 66 ఓట్లు వచ్చాయి. దీంతో అధ్యక్షునిగా మాడూరి వినోద్ కుమార్ ఎన్నికయ్యారు. అదేవిధంగా జనరల్ సెక్రటరీ పదవీకి స్. రాజేందర్, శీలం చంద్రశేఖర్ పోటీ చేయగా, చంద్రశేఖర్ కి 119 ఓట్లు, రాజేందర్ కి 392 ఓట్లు పడ్డాయి. దీంతో జన రల్ సెక్రటరీగా కె. రాజేందర్ ఎన్నికయ్యారు. కోశాధికారి పదవీకి పల్లెర్ల కృష్ణ ప్రసాద్, పోలు సతీష్ పోటీ చేయగా, కృష్ణ పసాద్ ki 114 ఓట్లు, సతీష్కు 395 ఓట్లు పడ్డాయి. దీంతో కోశాధికారిగా సతీష్ ఎన్నికయ్యారు. ఎన్నికైన ప్రెసిడెంట్, జ నరల్ సెక్రటరీ, ట్రెజరర్లను కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆయా మండలాల ప్రెసిడెంట్స్, జనరల్ సెక్రటరీలు, ట్రె జరర్స
.
Aksharam Telugu Daily