MD NASEER MIYA , CRIME REPORTER, BHADRADRI KOTHAGUDEM. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం క్రమేపీ పెరుగుతూ ఉదృతంగా ప్రవహిస్తున్నది. కావున గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ శాఖ ఇతర శాఖల సమన్వయంతో ముందస్తు చర్యలు చేపడుతుందని తెలియజేశారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయని తెలిపారు. ఉదృతంగా ప్రవహిస్తున్న చెరువులు, వాగులు, వంకల వద్దకు వీడియోల కోసం,సెల్ఫీల కోసం వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని సూచించారు. వాహనదారులు ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఎవరైనా విపత్కర పరిస్థితుల్లో ఉంటే వెంటనే డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసు వారి సేవలను వినియోగించుకోవాలని తెలిపారు.
-
Aksharam Telugu Daily