Thursday, 22 October 2026 04:30:37 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

విజయదశమి రోజే రావణ దహనం నిర్వహించాలి.. వేడుకలను బహిష్కరిస్తున్నాం స్థానిక సంప్రదాయాలను పక్కనపెట్టిన బీఎంఎస్ వైఖరిపై ఐఎన్‌టీయూసీ విమర్శలు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 21 October 2026 05:34 PM Views : 84

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపెల్లి/ గోదావరిఖని (జ్యోతి నగర్ ): : జ్యోతినగర్, ఎన్టీపీసీ అక్టోబర్ 21 పెద్దపల్లి జిల్లా అక్షరం న్యూస్: ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లో విజయదశమి పండుగ రోజున నిర్వహించాల్సిన రావణ దహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించడం స్థానిక సంప్రదాయాలకు విరుద్ధమని ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ (ఐఎన్‌టీయూసీ) ప్రధాన కార్యదర్శి వేముల కృష్ణయ్య పేర్కొన్నారు. స్థానిక ప్రజల ఆచార వ్యవహారాలను గౌరవించకుండా కార్యక్రమాలు నిర్వహించడం విచారకరమని అన్నారు. ఎన్నికల్లో గెలిచిన బీఎంఎస్ యూనియన్ స్థానిక సంప్రదాయాలకు ప్రాధాన్యమివ్వాల్సింది పోయి, ఇతర ప్రాంతాల అధికారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ స్థానిక ఆచారాలకు విరుద్ధమైన కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వేముల కృష్ణయ్య తెలిపారు. స్థానిక ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత కార్మిక సంఘాలపై ఉందని పేర్కొన్నారు. ఎన్టీపీసీ టౌన్‌షిప్ భిన్న ప్రాంతాలు, భాషలు, సంస్కృతులకు చెందిన ప్రజలు కలిసిమెలిసి జీవించే మినీ భారత్‌లాంటిదని ఆయన అన్నారు. తెలంగాణ నేల ఇతర ప్రాంతాల ప్రజలను ఆప్యాయంగా ఆదరించే గొప్ప సంస్కృతికి నిలయమని, ఇక్కడి సంప్రదాయాలను కూడా అందరూ గౌరవించాలని సూచించారు. విజయదశమి రోజున రావణ దహనం నిర్వహించడం స్థానికంగా అనుసరిస్తున్న సంప్రదాయమని, అందుకు భిన్నంగా మరుసటి రోజు నిర్వహించడం స్థానిక ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎన్టీపీసీ యాజమాన్యం, సంబంధిత కమిటీలు తగిన చర్యలు తీసుకోవాలని వేముల కృష్ణయ్య కోరారు. స్థానిక సంప్రదాయాలకు విరుద్ధంగా మళ్లీ వ్యవహరిస్తే కార్మికులు, స్థానిక ప్రజల తరఫున ఐఎన్‌టీయూసీ నిరసన కార్యక్రమాలు చేపడుతుందని స్పష్టం చేశారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :