D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 8 తల్లాడ ( అక్షరం న్యూస్) తల్లాడ మండలం లక్ష్మీపురం గ్రామ మాజీ సర్పంచ్ ఓబుల సీతారామరెడ్డి మాతృమూర్తి ఓబుల రామకోటమ్మ దశదిన కార్యక్రమానికి తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైరా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాపా సుధాకర్ హాజరై ఓబుల రామకోటమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులందరికీ తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నివాళులు అర్పించిన వారిలో తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కంపూడి కిషోర్, సొసైటీ డైరెక్టర్ గోవింద్ శ్రీను, లక్ష్మీపురం ఉపసర్పంచ్ బండి బాలశౌరి, షేక్ మీర్జా, తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ షేక్ జమాల్ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily