AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/ చర్ల అక్టోబర్ 14/ అక్షరం న్యూస్/----- నక్సల్స్ సంస్థలో అతిపెద్ద నాయకులలో ఒక్కరైనా సోను అలియాస్ భూపతి తన 61 మంది సహచరులతో కలసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్ ఎదుట లొంగిపోతున్నట్లు గా వార్తలు వస్తున్నాయి. నక్సలిజం చరిత్రలో అతిపెద్ద వార్తగా ఇది వెలువడనుంది. గతంలో భూపతి విడుదల చేసిన కాల్పుల విరమణ ప్రెస్ నోట్ సంస్థలో అశాంతికి కారణమైనది. నక్సలైట్ సంస్థ సోను మరియు అతని సహచరుల నుండి ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలని పి ఎల్ జి ఏ నీ ఆదేశించింది. సోను ప్రాణాలకు అతని స్వంత సహచరుల నుండే ప్రమాదం ఉంది. ఇంతలోనే అతను లొంగిపోతున్నట్లు గా వార్తలు రావడం చర్చానియంశంగా మారింది.
.
Aksharam Telugu Daily