Sunday, 07 June 2026 05:16:06 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

భూ భరతి- చట్టం 25 పై అవగాహన సదస్సు *భూ సమస్యల పరిష్కారానికి గొప్ప వేదిక భూ భారతి నూతన ఆర్వోఆర్ చట్టం - 2025,*

అప్పీల్ చేసిన ప్రతీ ఒక్కరికీ భూ భారతి నూతన ఆర్వోఆర్ చట్టం ప్రకారం పక్కాగా న్యాయం* *జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్


D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT.

Reporter

Date : 21 April 2025 06:57 PM Views : 1126

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : ** మహబూబాబాద్ జిల్లా / గంగారం/ ఏప్రిల్ 21 (అక్షరం న్యూస్) గంగారం మండల కేంద్రంలోని భూ సమస్యల పరిష్కారానికి గొప్ప వేదిక భూ భారతి నూతన ఆర్వోఆర్ - 2025, చట్టంన్నారు జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం 25 అవగాహన సదస్సు సోమవారం కొత్త గూడ, గంగారం మండలల కేంద్రం రైతువేదిక లలో జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు (రెవెన్యూ) కె.వీరబ్రహ్మంచారి, రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణవేణి, స్థానిక తహసిల్దార్లు రమాదేవి,సత్యనారాణ, ఎంపిడిఓలు రవీంద్రప్రసాద్ బి.అప్పారావు ఏఈఓ రాంబాబు తదితరులు హాజరై తెలంగాణ గీతం ఆలపించి, పిపిటి, చదివి రైతులకు భూ భారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంపై అవహన కల్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూ భారతి నూతన ఆర్వోఆర్ చట్టం అని ప్రతి భూ సమస్య సులభంగా పరిష్కారం కోసం ఈ పోర్టల్ చాలా ఉపయోగ పడుతుందని, గతంలో చిన్న చిన్న భూ విషయాలు, సమస్యలు పరిష్కారం తమ పరిధిలో లేక అనేక ఇబ్బందులు ఏర్పడేవన్నారు, ఇప్పుడు సామాన్య ప్రజలకు, రైతులకు అందుబాటులో భూ సమస్యలు పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు సూచించారు జారీ చేయడం జరిగిందని రైతు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి అధికారులకు కేటాయించిన సమయంలో రైతుల దరఖాస్తు కు సమాధానాలు పరిష్కారం చూపే విధంగా ఈ కొత్త చట్టం ఉంటుందని అన్నారు పూర్తిగా న్యాయమైన భూ సమస్యలను ప్రభుత్వం సూచించిన భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం ప్రకారం పరిష్కారం చేయుటకు పూర్తి అధికారాలు గ్రామ అధికారి తహసిల్దార్ రెవిన్యూ డివిజనల్ అధికారి కలెక్టర్ స్థాయి లలో ఇప్పుడు వర్తిస్తుందని రైతులు ఎలాంటి భూ సమస్యలకైనా అప్పీల్ ద్వారా హక్కును పొంది స్వేచ్ఛ రైతులకు ప్రజలకు ఉంటుందని అన్నారు, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె వీరబ్రహ్మచారి మాట్లాడుతూ గత ధరణి పోర్టల్ ద్వారా సామాన్య రైతులకు రెవెన్యూ అధికారులు న్యాయం చెయ్యలేక పోయారని, ప్రతి చిన్న విషయానికి సివిల్ కోర్టులకు వెళ్ళే వారని, కొందరు రైతులు కోర్టుకు వెళ్లే అంత ఆర్థిక స్తోమత లేకపోయేసరికి భూ సమస్యలను అలానే వదిలివేసారని, గుర్తుకు చేశారు, ప్రస్తుత ప్రభుత్వం క్షేత్రస్థాయిలో భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం గొప్ప వేదిక కల్పించిందని (జీపిఓ) గ్రామ స్థాయిలో ఒక్క అధికారిని నియమించి వారస్వతం, ఏజెన్సీ భూ హద్దులు తదితర అంశాలపై వారికి నిర్దేశించిన సమయంలో కచ్చితంగా న్యాయం జరిగే విధంగా ఈ భూ భారతి నూతన ఆర్వోఆర్ చట్టంన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వివిధ శాఖ అధికారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :