AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల సెప్టెంబర్ 15/అక్షరం న్యూస్/-------వంద అడుగులైన ఒక్క అడుగుతోనే మొదలవుతుందనేది ఎంత నిజమో ఐశ్వర్య మహిళా శక్తి అసోసియేషన్ సేవా కార్యక్రమాలు కూడా దినదినాభివృద్ధి చెందుతున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. తేగడ గ్రామానికి చెందిన లక్ష్మీ నరసింహ రెడ్డి ప్రోత్సాహంతో కొద్దిమంది మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడుతూ ఆర్థిక అభివృద్ధి సాధించుకోవడం కోసం ఐశ్వర్య మహిళా శక్తి అనే ఒక గ్రూపును స్థాపించుకోవడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు ఇంటింతై వటుడింతై అన్నట్లుగా ఆ గ్రూపు మహిళలు తమకు తాము ఆర్థికంగా నిలదొక్కు కుంటూ గ్రామంలోని చిన్నచిన్న సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి దృష్టిని ఐశ్వర్య మహిళా శక్తి గ్రూపు వైపు మల్లెల చేసింది. దానికి నిదర్శనం నేడు వారు ఒక నిరుపేద కుటుంబానికి అండగా నిలబడటమే. ఆడవారు మీకు జోహార్లు అంటూ ఐశ్వర్య మహిళా శక్తి చేసిన మంచి పనికి పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు. మహిళలు కుటుంబాన్ని చూసుకుంటూనే సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావడం చాలా సంతోషించదగ్గ విషయమని ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు ముందు ఇలాగే కొనసాగించాలని ఐశ్వర్య మహిళా శక్తి అసోసియేషన్ ను ప్రోత్సహిస్తూ పాకలపాటి సత్యనారాయణ రాజు ఐదు రూపాయలను గ్రూపు సభ్యులకు అందించి వారిలో మరింత ఉత్సాహాన్ని నింపారు. ఆడవాళ్లు తలచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని దానికి నిదర్శనమే ఐశ్వర్య మహిళా శక్తి అసోసియేషన్ అని పలువురు అభినందనలు తెలియజేశారు.
.
Aksharam Telugu Daily