Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ జూన్ 19 అక్షరం న్యూస్ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట పురుగుల మందు డబ్బాతో తల్లి కొడుకు కన్నీరుమున్నీరు అయ్యారు న్యాయం జరిగే వరకు జీవితాన్ని అరగంతో పెట్టి పోరాటం చేస్తామని హెచ్చరించారు. సబ్బితం గ్రామానికి చెందిన రాజు శంకరయ్య అనే రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి కొన్ని సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై మానసికంగా ప్రభావితమయ్యారని అప్పటి నుంచి తరచూ ఇంటిని వదిలిపెట్టి తిరుగుతూ ఉంటారని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు ప్రతి సారి స్థానికుల సాయంతో తిరిగి ఇంటికి తీసుకొచ్చేవారన్నారు ఇలాంటి పరిస్థిలో తన భర్త పేరున ఉన్న 4 ఎకరాల 28 గుంటల భూమిని రాఘవపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఆడెపు వెంకటేష్ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని బాధితురాలు ఆరోపించారు. గతంలో కూడా భూమిని ఇతరులకు విక్రయించే ప్రయత్నం జరిగినపుడు కలెక్టరేట్ వద్ద ఫిర్యాదు చేసి భూమిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టించామని చెప్పారు. అయితే తాజాగా ఆడెపు వెంకటేష్ తన రాజకీయ బలాన్ని ఉపయోగించి అధికారుల సహకారంతో భూమి స్థితిని మార్చించి, పట్టా పొందాడని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయంపై కలెక్టర్‌కు వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ అధికారుల వైఖరి నిర్లక్ష్యంగా మారిందని వాపోయారు. మాకు న్యాయం జరగకపోతే కలెక్టరేట్ ఆవరణలోనే పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంటాం’’ అంటూ హెచ్చరించిన తల్లి-కొడుకులు, మాజీ సర్పంచ్ నుంచి తమకు ప్రాణహాని ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు వెంటనే స్పందించి, బాధితుల మొరను పరిశీలించి దర్యాప్తు జరిపించాలని, అక్రమంగా భూమి రిజిస్ట్రేషన్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు వారు విజ్ఞప్తి చేశారు
.
Aksharam Telugu Daily