D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 9 (అక్షరంన్యూస్) ఢిల్లీ: ప్రజల్లో చైతన్య దీప్తిని రగిలించి జీవితాంతం వారి గొంతుకగా బతికిన ప్రజా కవి శ్రీ కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని.. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తో కలిసి ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి ఘన నివాళులర్పించారు. స్వరాష్ట్ర ఉద్యమానికి తన రచనలతో స్ఫూర్తిని నింపిన మహనీయుడని స్మరించుకున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఎంపీలకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం మంగళవారం ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారితో కలిసి అల్పాహారం స్వీకరించి.. ఓటింగ్ పై దిశా నిర్దేశం చేశారు.
.
Aksharam Telugu Daily