GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల/ జిల్లా స్టాపర్/ ఆగస్టు 20 (అక్షరం న్యూస్); భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు కాముని వనిత ఆధ్వర్యంలో సిరిసిల్ల కొత్త బస్టాండ్ సమీపంలో నేషనల్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లంబా మరియు రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావు ఆదేశాలతో ప్రత్యేక సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉచితంగా సానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేశారు. మహిళా కాంగ్రెస్ మెంబర్షిప్ ద్వారా సమకూరిన నిధులతో సానిటరీ ప్యాడ్స్ మిషన్ కొనుగోలు చేసి మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఉత్పత్తయిన సానిటరీ పాడ్స్ ఉచితంగా అందించి అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు మడుపు శ్రీదేవి, టౌన్ అధ్యక్షురాలు మార్కెట్ కమిటీ చైర్మన్ వేముల స్వరూప, జిల్లా జనరల్ సెక్రటరీ కోడం అరుణ, వైస్ ప్రెసిడెంట్ సామల రోజా, కోడం సుధా, సాగాల లత, మార్గం మంజుల, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు స్థానిక మహిళలు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily