D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా / కొత్తగూడ/ ఏప్రిల్ 21(అక్షరం న్యూస్ ) కొత్తగూడ మండలంలోని హనుమాన్ ఆలయంలో ఈరోజు హనుమాన్ ఉత్సవ విగ్రహ ఆవిష్కరణ వేడుక అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమానికి కొత్తగూడ ఎస్ఐ రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజ్ కుమార్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, హనుమంతుని ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం హనుమాన్ సేవ సమితి కమిటీ సభ్యులు ఎస్ఐ రాజ్ కుమార్‌ను ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.... విగ్రహదాతలు ముందుకు రావడం చాలా సంతోషమని అన్నారు. హనుమాన్ సేవ సమితి కమిటి ఎస్ఐ గారికి శాలువా కప్పి, తమ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, హనుమాన్ నామస్మరణతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించారు.
.
Aksharam Telugu Daily