Wednesday, 18 November 2026 12:30:31 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

పిల్లల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ* అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారం సద్వినియోగం చేసుకోవాలి* జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

ముస్తాబాద్ అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం 10 నిమిషాల కార్యక్రమం నిర్వహణ, ప్రాథమిక పాఠశాలలో తనిఖీ పిల్లల పెరుగుదల పర్యవేక్షణ కార్డుల ఆవిష్కరణ


GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLA

Reporter

Date : 17 November 2026 07:00 PM Views : 256

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మేడ్చల్ /దమ్మాయిగూడ : . రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్, /నవంబర్ -17(అక్షరం న్యూస్ ) అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెడతారని, వారిని ప్రతి రోజూ కేంద్రాలకు పంపించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. ముస్తాబాద్ అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం 10 నిమిషాల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ముందుగా అంగన్వాడి కేంద్రంలో పిల్లల ఎత్తు, బరువును పరిశీలిస్తుండగా తనిఖీ చేశారు. సామ్, మామ్ పిల్లలపై ఆరా తీశారు. వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయగా, పరిశీలించారు. పిల్లల పెరుగుదల పర్యవేక్షణ కార్డులను ఆవిష్కరించారు. ప్రాథమిక పాఠశాలలో తనిఖీ అక్కడే ఉన్న ప్రాథమిక పాఠశాలలో జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నూతన యూనిఫాంలు వేసుకున్న విద్యార్థులతో మాట్లాడారు. గణితం, ఇతర అంశాలపై ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ఈ సందర్భంగా పోషణ మాసం ప్రాముఖ్యతను గర్భిణులు, బాలింతలు పిల్లల తల్లిదండ్రులకు వివరించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రతి మంగళవారం 10 నిమిషాలు కార్యక్రమాన్ని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్రాల సేవలు, వసతులు మెరుగు పరచడం, పోషకాహారం పంపిణీ, బాలల హక్కుల రక్షణ, వసతుల పెంపు తదితర అంశాలపై స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొనాలని సూచించారు. ప్రతి రోజూ తల్లిదండ్రులు బాధ్యతగా ఆరేళ్లలోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు క్రమం తప్పకుండా తీసుకెళ్లాలని వారి ఎత్తు, బరువు నమోదు చేయించాలని దానికి అనుగుణంగా పోషకాహారం అందించాలని సూచించారు. పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఇప్పటి నుంచే సరైన పోషకాహారం అందించాలని స్పష్టం చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు నిత్యం పంపించడంతో పిల్లలకు పోషకాహారం అందుతుందని, ఆట, పాటలు బొమ్మల ద్వారా విద్య బుద్దులు చెపుతారని వివరించారు. బాలల మొదటి వెయ్యి రోజుల దశ కీలకమని, వారికి సరైన పోషకాహారం ఇంట్లో సైతం ఇవ్వాలని సూచించారు. త్వరలో ఎనిమియా ముక్త్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. సర్పంచులు అంగన్వాడీ కేంద్రాల్లో పరిశీలించాలని, సామ్, మామ్ పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పోషకాహారం అందేలా చూడాలని సూచించారు. తల్లులు ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి రక్త హీనతతో ఉన్న మహిళలు ప్రతి ఆరు నెలల ఒకసారి రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు, మహిళలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. ఆకుకూరలు, కూరగాయలు, నువ్వులు, బెల్లం, మునగ ఆకులు, కాయలు ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు. వేములవాడ ఏరియా ఆసుపత్రిలోని డీఈఐసీ కేంద్రం ఎదుగుదల లోపాలు గల పిల్లలు, చెవిటి, మూగ, మానసిక బుద్ధి మాంద్యం గల, నడవలేని వాళ్లు, పుట్టుకతో వచ్చే లోపల గల పిల్లలు, మెదడు సంబంధించిన సమస్యలు, సరిగా మాట్లాడ లేని పిల్లలు, రక్తహీనత పోషకాహారం లోపం గల పిల్లలను అంగన్వాడీ కేంద్రాల వారి సమాచారంతో వైద్యులు వివిధ పరీక్షలు చేసి పిల్లలలోని లోపాన్ని గుర్తిస్తారని తెలిపారు. ఆర్ బీ ఎస్ కే వాహనం ద్వారా వేములవాడ ఏరియా ఆసుపత్రిలోని డీఈఐసీ కేంద్రానికి తరలించి వైద్య సేవలు అందిస్తారని వెల్లడించారు. అలాగే కరీంనగర్ లో ఎన్ ఆర్ సీ కేంద్రంలో సేవలు అందిస్తారని, ఉన్నత వైద్య సేవలు హైదరాబాద్ లో అందిస్తారని వెల్లడించారు.కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరుట్ల మహేష్ రెడ్డి, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజి రెడ్డి,మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మట్ట వెంకటేశ్వర్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి, జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి నిర్మల, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, తహసీల్దార్ ఫారూఖ్, ఎంపీడీఓ లచ్చాలు, వార్డు సభ్యులు,అంగన్వాడీ టీచర్లు, ఏ ఎన్ ఎం లు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :