AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ నవంబర్ 21 అక్షరం న్యూస్ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం పెద్దపల్లి పట్టణంలోని తెనుగువాడ 18వ వార్డులో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా మత్స్యశాఖ అధ్యక్షుడు కొలిపాక నర్సయ్య జెండా ఎగురవేసి మత్స్యకారులకు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొలిపాక నర్సయ్య మాట్లాడుతూ. మత్స్యకారుల ఐక్యత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తరతరాలుగా చేపల వేటను వృత్తిగా చేసుకొని జీవనం సాగిస్తున్న మత్స్యకారుల శ్రమకు సమాజంలో తగిన గుర్తింపు రావాలన్నారు. మత్స్యకారుల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వాలు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మత్స్యకారుల హక్కుల సాధనకు ఐక్యంగా కృషి చేయాలని, సంఘటితంగా ఉన్నప్పుడే సమాజంలో అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో మౌటం నర్సింగం, భూతగడ్డ తిరుపతి, భూతగడ్డ సారయ్య, కొలిపాక లక్ష్మణ్, వేల్పుల రాజేశం, మౌటం శంకర్, ఆశాలు, వేల్పుల కనుకయ్య, వేల్పుల సంతోష్, గంగుల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily