AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా /3 ఏప్రిల్/ అక్షరం న్యూస్ :గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయడం మాని గ్రామ సభల పేరుతో కాలయాపన చేస్తోందని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి ఫైరయ్యారు. గ్రామ సభలతోనే ఐదేళ్ల కాలం వెళ్లదీసేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటికి మూడుసార్లు ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు స్వీకరించారని తెలిపారు. స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారంలో మాత్రం ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఈరోజు కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన గ్రామసభల్లో తిరిగి ప్రజల నుంచి దరఖాస్తులు కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో స్వీకరించిన దరఖాస్తులు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన తర్వాత జవాబుదారీగా ఉండాలని తెలియదా అని అడిగారు. గ్రామసభ నిర్వహించిన ప్రతిసారి పథకం కావాలంటే అప్లై చేసుకోవాలని చెప్పడంతో ఈ ప్రభుత్వంపై ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారని స్పష్టం చేశారు. సభలు, సమావేశాలు మాని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తే అన్ని సమస్యలు పరిష్కారం అయినట్లే అని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచనలు చేశారు.
.
Aksharam Telugu Daily