D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : .. ఖమ్మం/వైరా అక్టోబర్ 17 (అక్షరం న్యూస్) తెలంగాణసంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ సంబరాలు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మండలకాంగ్రెస్ పట్టణ పార్టీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ దంపతులు మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణ. బతుకమ్మ ఆడారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బతుకమ్మ కేవలం పండగ మాత్రమే కాదని తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రకృతి ఆరాధించే గొప్ప సాంస్కృతిక ప్రతీక అని పేర్కొన్నారు. ప్రాంగణంలో బంతి చామంతి గునుగు తంగేడు తదితరు పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వాటి చుట్టూ మహిళలు మెప్మా ఆర్పి మహిళలు చేరి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలంటూ సంప్రదాయ గీతాలు ఆలపించారు . తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను నూ వివరించారు. మహిళలందరూ సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. రాందాస్ నాయక్ దంపతులు బతుకమ్మ వేడుకలో లయబద్ధంగా అడుగులు వేస్తూ కోలాటంతో ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కట్ల సంతోష్ సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ దంపతులు టి పి సి సి కార్యదర్శి కట్ల రంగారావు మార్కెట్ కమిటీ చైర్మన్ బోళ్ళ గంగారావు కాంగ్రెస్ పార్టీ మండల పట్టణ పార్టీ అధ్యక్షులు శీలం చంద్రశేఖర్ రెడ్డి వీరం శెట్టి సీతారాములు డిసిసి జిల్లా మెడికల్ సెల్ అధ్యక్షులు డాక్టర్ కాపా మురళీకృష్ణ లయన్స్ కంటి హస్పటల్ నిర్వాహకులు ఉండ్రు శ్యాంబాబు 13వ వార్డ్ కౌన్సిలర్ ముళ్ళపాటి విజయలక్ష్మి సీతారాములు , కౌన్సిలర్లు వేముల శ్రావణివుండ్రు వరలక్ష్మి పణి తి సైదులు తాటిపూడి సర్పంచి జవాజ అశ్విని మచ్చ బుజ్జి చెరుకూరి కిరణ్ మున్సిపల్ సిబ్బంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని బతుకమ్మ పాటలు, ఆటలతో వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు ఆకాంక్షించారు. బతుకమ్మలు సాగ నింపే కార్యక్రమంలో పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు.
.
Aksharam Telugu Daily