Thursday, 09 July 2026 11:55:17 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

రాష్ట్ర ముఖ్యమంత్రి  పర్యటన నేపథ్యంలో ఖమ్మం - బోనకల్ మార్గాలలో ట్రాఫిక్ ఆంక్షలు...

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 09 July 2026 07:07 PM Views : 135

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్ జూలై 9 (అక్షరం న్యూస్) ఈ నెల 10న రాష్ట్ర ముఖ్యమంత్రి  పర్యటన నేపథ్యంలో ఖమ్మం జిల్లా చింతకాని మండలం, నామవరం క్రాస్ రోడ్, జగన్నాథపురంలో జరిగే రైతు ఆశీర్వాద సభ కు వచ్చే రైతులు, ప్రజలు, అధికారులు, మీడియా, తదితర వాహనాలు మినహా ఖమ్మం నుండి బోనకల్ కు సాధారణ వాహనాల రాకపోకలు నిలిపివేయడం జరుగుతుందని వైరా ఏసీపీ సారంగపాణి తెలిపారు. ట్రాఫిక్ రద్దీ ని దృష్టిలో పెట్టుకొని ఉదయం 6:00 గంటల నుండి రాత్రి 12:00 గంటల వరకు ఆంక్షలు అమలులో వుంటాయని, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు వెళ్లాలని సూచించారు. ఖమ్మం నుంచి వయా పందిళ్లపల్లి, చింతకాని, బోనకల్, ఆంధ్రకు వెళ్లే వాహనాలు నేలకొండపల్లి  మీదుగా వెళ్లాలని, అదేవిధంగా బోనకల్లు నుంచి ఖమ్మం వైపు వచ్చే వాహనాలు వైరా మీదుగా రావాలన్నారు. ధాంసలాపురం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు దగ్గర నుంచి బోనకల్ బ్రిడ్జి వరకు సాధారణ వాహనాలు అనుమతించబడదు.           Note:  హైదరాబాదు నుంచి మీటింగ్ కి వచ్చే విఐపి వాహనాలు కోదాడ, నేలకొండపల్లి, ముదిగొండ లోని వల్లపురం నుంచి మీటింగ్ స్థలం కి త్వరగా చేరుకోవచ్చు ని తెలిపారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :