D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ తల్లాడ టౌన్ సెప్టెంబర్ 30 (అక్షరం న్యూస్) తల్లాడ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ నాలుగేళ్లపాటు పోలీస్‌శాఖకు సేవలందించిన ఏఎస్ఐ,హెడ్ కానిస్టేబుల్‌కు బదిలీ నేపథ్యంలో ఘన వీడ్కోలు కార్యక్రమం నిర్వహించేందుకు పోలీస్‌స్టేషన్ సిబ్బంది ఏర్పాట్లు చేశారు.నాలుగేళ్ల సేవలకు గుర్తుగా ఆత్మీయ వీడ్కోలు ఎస్ఐ వెంకటకృష్ణ మరియు ఎస్సై వెంకటేష్ అధ్యక్షతన జరిగిన సన్మానం ఘనంగా ఉన్నతంగా నిర్వహించారు. తల్లాడ పోలీస్‌స్టేషన్ పరిధిలో విధులు నిర్వహించిన సమయంలో శాంతిభద్రతల పరిరక్షణ,ప్రజలకు అందుబాటులో ఉండటం, పోలీస్‌శాఖకు సంబంధించిన విధులను సమర్థవంతంగా నిర్వహించడంలో వారు అందించిన సేవలను ఈ సందర్భంగా సిబ్బంది గుర్తుచేసుకున్నారు. బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్తున్న ఏఎస్ఐ చెన్నారావు, పిచ్చయ్య,హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు లను తల్లాడ పోలీస్‌స్టేషన్ సిబ్బంది ఆత్మీయంగా సన్మానించి, పుష్పగుచ్ఛాలు అందజేసి వీడ్కోలు పలికారు ఈ క్రమంలో సన్మాన గ్రహీతలు మమ్మల్ని గుర్తించి మాకు ఇచ్చిన గౌరవం కు వెంకటకృష్ణ మరియు వెంకటేష్ లకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని వారు ఆనందాన్ని వ్యక్తపరిచారు.విధి నిర్వహణలో వారి సహకారం, సహచరులతో కలిసి మెలిసి పనిచేసిన తీరును సిబ్బంది ప్రశంసించారు. ఎస్సై వెంకటకృష్ణ మాట్లాడుతూ కొత్త బాధ్యతల్లోనూ విధి నిర్వహణలో మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు, తల్లాడలో అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొంటూ,బదిలీపై వెళ్తున్న పోలీస్ సిబ్బంది నూతన విధుల్లోనూ విజయవంతంగా రాణించాలని పోలీస్‌స్టేషన్ సిబ్బంది ఆకాంక్షించారు.
.
Aksharam Telugu Daily