Saturday, 18 April 2026 06:47:12 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

వాసవి మాత కు పంచామృతాలతో అభిషేకం

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 12 August 2025 05:19 PM Views : 698

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల ఆగస్టు 12/అక్షరం న్యూస్/---శ్రావణమాసం శ్రావణ మంగళవారాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని త్రికూట దేవాలయం నందు కొలువై ఉన్న శ్రీ వాసవి మాత కు ఆలయ అర్చకులు పంచామృతాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ముందుగా అర్చకులు గణపతి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం అమ్మవారికి వివిధ పండ్ల రకాలు కలిగిన 108 బిందెలతో అభిషేకం చేశారు. సాయంత్రం అమ్మవారికి 108 కేజీల పసుపు 108 కేజీల కుంకుమతో అర్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అర్చకులు తెలిపారు. కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులైయ్యారు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ నిర్వహకులు అన్ని ఏర్పాట్లను చేశారు. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన త్రికూట ఆలయ కమిటీ సభ్యులను పలువురు అభినందించారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :