Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ మే 14 అక్షరం న్యూస్ విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావు అన్నారు జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ పెద్దపల్లి ఆర్ మహిపాల్ రెడ్డి ఆదేశాలతో బుదవారం పెద్దపల్లిలోని ట్రినిటీ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులకు గంజాయి డ్రగ్స్ నార్కోటిక్స్ అలాంటి పదార్థాల గూర్చి అవగాహన కార్యక్రమం నిర్వహించారు విద్యార్థులు ఆ వ్యసనాలకు బానిసలు కావద్దని సమాజంలోని యువత కుటుంబలలోని కుమారుల పైన యువత ఏం చేస్తున్నారో కుటుంబం లోని వ్యక్తులు సమాజం మంచి కోరే పెద్దలు మేధావులు గమనించారని నార్కోటిక్స్ తీసుకునే అమ్మేవారు అనుమానం ఉన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇవ్వాలని మరియు బానిస ఐన వారిని కౌన్సిలింగ్ అండ్ డి అడిక్షన్ సెంటర్ కు పంపిస్తాము అనీ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు ఎక్సైజ్ ఎస్సై. జి జీవన్ రెడ్డి కానిస్టేబుల్స్ ఏ కృష్ణ కే దిలీప్ వారి సిబ్బంది పాల్గొని విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు తెలిపినారు
.
Aksharam Telugu Daily