Saturday, 18 April 2026 06:43:34 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

కరుణించిన వరుణుడు ముస్తాబాద్ లో జోరుగా కురుస్తున్న వాన

.


GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLA

Reporter

Date : 23 July 2025 07:32 AM Views : 1047

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల/ముస్తాబాద్/జులై-23(అక్షరం న్యూస్) ముస్తాబాద్ మండలం లోని వివిధ గ్రామాల్లో బుధవారం భారీ వర్షం కురుస్తుంది. ఉదయం నాలుగు గంటలకు ప్రారంభమైన వర్షం జోరుగా పడుతూనే ఉంది. వర్షం కోసం అన్ని వర్గాలు ఎదురుచూస్తున్న సమయంలో ఎట్టకేలకు పడటంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.  ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తుండటం తో పల్లపు ప్రాంతాల్లో నీరు చేరుతుంది. కొద్ది రోజుల నుంచి వర్షాలు లేకపోగా.. వేసవిని తలపించేలా ఎండలు కాస్తుండడంతో వరి నారుమళ్లు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. రైతులు ఆందోళన చెందుతున్న తరుణంలో వర్షం పడడంతో ఊటర చెందారు. వరి ఆకుమడులకు ఈ వర్షం ఊపిరి పోసిందని అంటున్నారు. అదే విధంగా ఇప్పటికే నాటిన సరుగుడు మొక్కలకు ఈ వర్షం ఎంతో దోహదపడుతుందని చెబుతున్నారువర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా సరైన వర్షాలు లేక భూముల్లో నాటిన పత్తి, కంది, సోయాబీన్‌, మినుము,పెసర మొక్కలు ఎండిపోయేదశకు చేరుకోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో ఆయా గ్రామ లలో కురుస్తున్న వర్షం పంటలకు మళ్లీ జీవం పోస్తుంది

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :