MD NASEER MIYA , CRIME REPORTER, BHADRADRI KOTHAGUDEM. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/బూర్గంపహాడ్ : భద్రాద్రి కొత్త గూడెం జిల్లా/ బుర్గంపహాడ్ /జనవరి 2/అక్షరం న్యూస్ : మండల పరిధిలోని భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాల్వంచలోని కేఎల్ఆర్ కళాశాలకు చెందిన బస్సు అకస్మాత్తుగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 60 మంది విద్యార్థినీ, విద్యార్థులు గాయాలపాలయ్యారు. ప్రమాద సమయంలో ఒక విద్యార్థిని బస్సులో ఇరుక్కుపోయినట్లు సమాచారం కాగా, ఆమె పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా విద్యార్థులకు కూడా తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే స్పందించి వారిని సమీపంలోని ఆసుపత్రులకు ఇతర వాహనాల్లో తరలించారు. స్పష్టత రావాల్సి ఉండగా, సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
-
Aksharam Telugu Daily