Thursday, 15 October 2026 04:24:55 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

వైరా మున్సిపాలిటీలో అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణ పనుల్లో జాప్యంపై కలెక్టర్ ఆగ్రహం.. వైరా రిజర్వాయర్‌కు వెళ్లే రహదారి, పర్యాటక అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలి.. వైరా పట్టణంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తో కలిసి పర్యటించిన కలెక్టర్..


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 14 October 2026 08:33 PM Views : 327

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ వైరా అక్టోబర్ 14 (అక్షరం న్యూస్) వైరా మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణంలో ఉన్న వివిధ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణతో కలిసి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ వైరా మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంపై కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో జాప్యాన్ని నివారించి, నిర్దేశిత గడువులోగా నిర్మాణాలను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అనంతరం రింగ్ రోడ్డు సెంట్రల్ నుంచి వైరా రిజర్వాయర్‌కు వెళ్లే రహదారిని కలెక్టర్ పరిశీలించారు. రిజర్వాయర్ గుట్టపై పర్యాటక అభివృద్ధికి, రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో పనులకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖ అధికారులను ఆదేశించారు. పర్యాటక అభివృద్ధికి అనుగుణంగా రహదారి పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు. అసంపూర్తిగా నిలిచిపోయిన ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్ భవనాన్ని కూడా జిల్లా కలెక్టర్ పరిశీలించారు. మార్కెట్ నిర్మాణ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణ, మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు, ఇతర అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యంగా పాలక వర్గం, మున్సిపల్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు అవసరమైన మౌళిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కట్ల సంతోష్, డాక్టర్ కాపా మురళీకృష్ణ,తాసిల్దార్ సురేష్, మున్సిపల్ కమిషనర్ రామచంద్ర రావు, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :