Thursday, 14 May 2026 03:09:34 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

తల్లిదండ్రులు విద్యార్థులు విద్యాభివృద్ధికి తోడ్పడాలి.. పాఠశాలలో విద్యార్థులు నమోదు పెంచాలి.. మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో సర్పంచులకు విద్య పైఅవగాహ

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 13 May 2026 06:15 PM Views : 100

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం : ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్ వైరా మే 13 (అక్షరం న్యూస్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజా పాలనా ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా శాఖ వారోత్సవాలలో భాగంగా ఈరోజు వైరా మండల విద్యాశాఖ, మండల విద్యాధికారి కొత్తపల్లి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సర్పంచులకు వైరాలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద విద్య పై అవగాహన సదస్సును నిర్వహించారు.ఈ అవగాహన సదస్సులో వైరా మున్సిపాలిటీ చైర్మన్ డా. కాపా చంద్రకళ మాట్లాడుతూ ప్రతి సర్పంచి తల్లిదండ్రులతో సత్సంబంధాలను కలిగి విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధికి తోడ్పడాలని అలా అని ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టేటువంటి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ మరియు తెలంగాణ పబ్లిక్ స్కూల్ వంటి పాఠశాలల తో పాటు ఈ విద్యా సంవత్సరం ఉదయం ఒకటి నుండి ఇంటర్మీడియట్ వరకు అల్పాహార కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని అలాగని మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్మీడియట్ వారికి కూడా అందజేస్తున్నారని అలాగే 22 వస్తువులతో కూడిన ఎడ్యుకేషన్ కిట్ ని కూడా త్వరలో విద్యార్థులకు అందజేయనున్నదని గ్రామ ప్రథమ పౌరులుగా గ్రామంలో ఉన్న విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య, ఆరోగ్యకరమైనటువంటి ఆహారం, క్రమశిక్షణ ఉన్నత విద్యా ప్రమాణాలు కలిగిన ఉపాధ్యాయులతో కూడిన బోధనను కలిగి ఉన్న ప్రభుత్వ పాఠశాలలపై ప్రతి ఒక్కళ్ళకి నమ్మకం కలిగించి విద్యార్థులు నమోదును పెంచుటకు కృషి చేయాలని వివరించారు. అలాగే గ్రామాలలో ప్రతి ఒక్కరూ బాల్య వివాహాల పట్ల మరియు యువతలో వచ్చేటువంటి మార్పును గమనిస్తూ ముఖ్యంగా పాఠశాల విద్యార్థుల్లో సెల్ మరియు డ్రగ్స్ పట్ల కలిగే వ్యామోహాలకు దూరంగా ఉండేటట్టు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి శ్రీ సక్రియ ఎంపీఓ రాజేశ్వరి, ఎంఈఓ కొత్తపల్లి వెంకటేశ్వర్లు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు దొంతబోయిన సత్యనారాయణ, జి మాధవరావు, ఏ ఏ పీ సి చైర్మన్లు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :