AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/ జమ్మికుంట : కరీంనగర్/జమ్మికుంట/అక్టోబర్ 21/అక్షరం న్యూస్: దేవీ నవరాత్రుల సందర్భంగా మోత్కులగూడెం గ్రామంలోని శాంభవి సేన ఆధ్వర్యంలో అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పోలీస్ అధికారి ఆకుల సతీష్ పటేల్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వదించారు. వచ్చే నెలలో జరగనున్న రాష్ట్ర పోలీస్ సంఘం ఎన్నికల్లో ఆకుల సతీష్ పటేల్ రాష్ట్ర అధ్యక్షుడిగా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఉత్తమ పౌరోహిత అవార్డు గ్రహీత శ్రీ మండలేముల కపర్తి శర్మ అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సతీష్ పటేల్‌ను ఆశీర్వదించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శాంభవి సేన ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily