GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి జులై 30 అక్షరం న్యూస్; పెద్దపల్లి మండలం హనుమంతునిపేట గ్రామంలో స్వశక్తి సంఘాల బ్యాంకు లావాదేవీలు, రుణాలపై జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆడిట్ అధికారులు విచారణ ప్రారంభించారు. "స్వశక్తి సంఘాల పేరుతో బ్యాంకు రుణాలు, హనుమంతుపేటలో వివో ఏ నిర్వాకం" అనే శీర్షికనం అక్షరం దినపత్రికలో ఈనెల 27వ తేదీన సభ్యురాళ్ల పేరుతో రుణాలు తీసుకొని సొంతానికి వాడుకున్న వివో ఏ కలీం అంశంపై సమగ్ర వార్త కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన జిల్లా గ్రామీణ అభవృద్ధి సంస్థ అధికారీ కాలిందిని హనుమంతుని పేట గ్రామంలో స్వసక్తి సంఘాల లావాదేవీలపై రుణాలపై సమగ్ర ఆడిట్ జరిపి నివేదిక సమర్పించాలని జిల్లా ఆడిట్ మేనేజర్లను ఆదేశించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం మండలంలోని హనుమంతుని పట గ్రామంలో గల సుమారు 6 స్వశక్తి సంఘాల లావాదేవీలకు సంబంధించి రికార్డులను పరిశీలించి ఆడిట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆడిట్ మేనేజర్లు సదాశివ, గోవర్ధన్ హాజరై రిజిస్టర్లను పరిశీలించి రికార్డులను ఆడిట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్తి ఆడిట్ నిర్వహిస్తే తప్ప ఇందులో జరిగిన అవకతవకలు బయటకు వస్తాయని తెలిపారు.
.
Aksharam Telugu Daily