D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ వైరా నవంబర్ 9 (అక్షరంన్యూస్) వైరా మండలం సోమవరం గ్రామం సమీపం లోని మామిడి తోటలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వన సమారాధన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మామిడి తోటలో ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు ఆర్యవైశ్య కుటుంబీకులు ఉసిరి చెట్టు వద్ద సత్యనారాయణ స్వామి వ్రత పూజలు నిర్వహించారు. అనంతరంఆర్యవైశ్యకుటుంబీకులు సహపంక్తి భోజనాలు నిర్వహించారు.మహిళలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు మాట్లాడుతూ కార్తీక మాసంలో మామిడి తోటలో వన సమారాధన కార్యక్రమం నిర్వహించి సత్యనారాయణ స్వామి వ్రతం పూజలు చేయడం మంచి శుభ పరిణామం అని అన్నారు. అనంతరం ఆటల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందించారు సత్యనారాయణ స్వామి వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అందాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు వనమా విశ్వేశ్వరరావు, డాక్టర్ పెరుమాళ్ళ కృష్ణమూర్తిఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు మిట్టపల్లి కిరణ్ కుమార్, ఆర్యవైశ్య సంఘం జిల్లా నాయకులు నూకల వాసు, నూకలప్రసాద్ , మండల నాయకులు యాండ్రపుడి శంకర్,కొప్పురావూరుశబరినాథ్,కొణతాలపల్లి సుజిత్, పెనుగొండ ఉపేంద్రరావు దారా కృష్ణ, బోనాల నిఖిల్,జల్లా అవినాష్, సముద్రాల మురళి, చల్ల రమణ, వజినేపల్లి చక్రవర్తి,రవి, రంగా రమేష్,కొల్లా రాంబాబు, వేముల కిషోర్, కటకం శివ, తెల్లాకుల సందీప్, సుగ్గల విజయ్, కోడుమూరి నాగబాబు, వనమా కార్తీక్ మిట్టపల్లి నరసింహారావు రంగా సత్యనారాయణ రాయపూడి వెంకటేష్ రంగా వాసవి నూకల అన్నపూర్ణ రాయల అన్నపూర్ణ నూకల వాణిశ్రీ మిట్టపల్లి మహాలక్ష్మి రాయపూడి రజిని పెనుగొండ సరిత సుగ్గల మాధవి నాళ్ల నాగమల్లేశ్వరి మిట్టపల్లి సంధ్య వనమా మణికుమారి శేషు కుమారి కొదుమూరు భాగ్యలక్ష్మి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily