GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి /కాల్వ శ్రీరాంపూర్ : కాల్వ శ్రీరాంపూర్, పెద్దపల్లి జిల్లా సెప్టెంబర్15 అక్షరం న్యూస్:ఎం ఆర్ పి ఎస్ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు వికలాంగుల వృద్ధులు వితంతుల చేయూత పెన్షన్ దారుల పెన్షన్ పెంచే వరకు పోరాటం ఆగదని అంబాల రాజేందర్ అన్నారు సోమవారం మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమం నిర్వహించి తహసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు అంబాల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము తమ ఎన్నికల మేనిఫెస్టో లో వృద్ధులకు వితంతువులకు మరియు వికలాంగులకు చేయూత పెన్షన్ రెట్టింపు చేస్తామని మాట ఇవ్వడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి ఓట్లు వేశామని తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్న వృద్ధుల వితంతుల వికలాంగుల పెన్షన్ పెంపు విషయంలో జాప్యం చేయడం ఏమాత్రం సరికాదని చేయూత పెన్షన్ దారులు ఆగ్రహానికి గురికాకముందే వృద్ధులకు 4వేల రూపాయలు వితంతులకు 4వేల రూపాయలు గీత కార్మికులకు బిడి కార్మికులకు 4వేల రూపాయలు వికలాంగులకు 6వేలు చెల్లించి 20 నెలల బకాయిని కూడా వెంటనే మంజూరు చేసి వృద్ధుల వితంతువుల వికలాంగుల అభిమానాన్ని చూరగోనలని వికలాంగులు వృద్ధులు వితంతువులు మరియు చేయూత పెన్షన్ దారుల ఆధ్వర్యంలో వందలాది మందితో కాల్వ శ్రీరాంపూర్ తాసిల్దార్ కార్యాలయం ముట్టడి (మహాధర్నా) పెద్ద ఎత్తున నిర్వహించామని తెలిపారు ఈ ముట్టడి కార్యక్రమంలో కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని వృద్ధులు, వితంతువులు మరియు వికలాంగులు పెద్ద ఎత్తున తరలివచ్చి ధర్నా లో పాల్గొని విజయవంతం చేశారన్నారు ఈ కార్యక్రమంలో ఎం ఆర్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు అంబాల రాజేందర్, వి హెచ్ పి ఎస్ మండల అధ్యక్షులు బైరి రామ్మూర్తి, విహెచ్పిఎస్ జిల్లా నాయకులు మంథని రామస్వామి, దంతనపల్లి ధర్మయ్య, వడ్ల పద్మ, రజిత, కాసర్ల సంపత్, మల్లమ్మ, కవిత, సంపత్, దంతనపల్లి సమ్మయ్య, రాజేశ్వరి, మరియు పెన్షన్ దారులు తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily