Wednesday, 04 March 2026 01:43:29 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఖమ్మం - మహబాద్ రోడ్డుకు వనజీవి రామయ్య పేరు పెట్టాలి: వద్దిరాజు* - రామయ్య కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎంపీ వద్దిరాజు

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 15 April 2025 03:14 PM Views : 966

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * ఖమ్మం /స్టాఫ్ రిపోర్టర్/ఏప్రిల్ 15 (అక్షరంన్యూస్) తన జీవితం మొత్తం మొక్కలు నాటాడానికే అంకితం చేసిన పద్మశ్రీ దరిపల్లి రామయ్య ధరిత్రి ఉన్నంతకాలం చిరస్థాయిగా నిలిచి ఉంటారని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఇటీవలే మృతి చెందిన వనజీవి రామయ్య కు మంగళవారం రవిచంద్ర నివాళులు అర్పించారు. రెడ్డిపల్లి లోని ఆయన నివాసానికి వెళ్లి చిత్ర పటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించిన, అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా వద్దిరాజు మాట్లాడుతూ.. రామయ్య పేరు ఎప్పటికీ గుర్తుండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఖమ్మం - మహబూబాబాద్ రోడ్డుకు వనజీవి రామయ్య మార్గ్ పేరుతో నామకరణం చేయాలని ఎంపీ రవిచంద్ర కోరారు. ఖమ్మం నుంచి రెడ్డిపల్లి వరకు 8 కిమీ మేర వనజీవి రామయ్య మొక్కలు నాటారని గుర్తు చేశారు. రోడ్డు విస్తరణలో భాగంగా ఆ చెట్లన్నీ కూల్చేసినందున, మళ్ళీ అదే వరసలో మొక్కలు నాటి.. సంరక్షించి రామయ్య కు నివాళులు అర్పించాలని కోరారు. ఈ విషయం లో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా మంత్రులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. రామయ్య చరిత్ర భావి తరాలకు తెలిసేలా కర్ణాటక తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా పాఠ్య పుస్తకాల్లో ఆయన చరిత్ర ను ప్రవేశ పెట్టాలని ఎంపీ రవిచంద్ర కోరారు. జిల్లాలో కూడా ఆయన స్మారకం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :