AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : అక్షరం ప్రతినిధి పెద్దపల్లి, మే 16 ప్రతీ నెల అమావాస్యను పురస్కరించుకొని గాయత్రీ సేవా సమితి ద్వారా అన్నప్రసాద వితరణ చేయడం అభినందనీయమని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు. శనివారం పెద్దపల్లి జెండా చౌరస్తా వద్ద గాయత్రీ సేవా సమితి ఆధ్వర్యంలో అమావాస్య సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రభుత్వ విప్ విజయరమణారావు ముఖ్య అతిథిగా హాజరై అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతీనెల అమావాస్య సందర్భంగా అన్నప్రసాద వితరణ చేయడం ద్వారా 35వ నెలను పూర్తి చేసుకోవడం గొప్ప విషయమన్నారు. దాతలుగా వ్యవహరించిన ఆవునూరి త్రివేణి- రవి కుమార్ దంపతులు కీ.శే. ఆవునూరి వెంకటేశం జ్ఞాపకార్థం అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. గత 34 నెలలుగా దాతల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని వ్యవస్థాపక అధ్యక్షులు కాసనగొట్టు వినయ్ తెలిపారు. అనంతరం వేసవి దృష్ట్యా ప్రజలకు మజ్జిగ పంపిణీ కూడా చేశారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లన్న, కౌన్సిలర్లు మంథని నర్సింగ్, దొడ్డుపల్లి జగదీష్, సేవా సమితి ప్రధాన కార్యదర్శి రావికంటి రాజు, ఉపాధ్యక్షులు చిట్టి మల్ల రవిప్రసాద్, కోశాధికారి కటకం సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ నాగమల్ల శ్రీనివాస్, బొల్లం ఆంజనేయులు, సభ్యులు ముస్త్యాల ప్రదీప్, తొడుపునూరి వెంకటేశం, సంకీస ఆంజనేయులు, కముటాల గురుచరణం, నార్ల రమేష్, అల్లెంకి మారుతీలు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily