GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /ఏప్రిల్ -29(అక్షరం న్యూస్ ) పదవ తరగతి ఫలితాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని ముస్తాబాద్ మండలం నామపూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న నిరుపేద కుటుంబానికి చెందిన బూస ప్రణవి 576 /600 మార్కులు సాధించి ముస్తాబాద్ ప్రభుత్వ పాఠశాల ల మండల టాపర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు అభినందనలు తెలిపారు. నా సక్సెస్ కి ప్రధాన కారణం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అని ఆ అమ్మాయి వెల్లడించింది. అమ్మాయి తో పాటు నామపూర్ ఆదర్శ పాఠశాల కు చెందిన సాయి త్రిలోక్ 572 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచాడు అవునూర్ జిల్లా పరిషత్ పాఠశాల కు చెందిన జి. స్నేహిత, 571,గురుకుల పాఠశాల కు చెందిన ఎ. వర్షిత్ 571 మార్కులు సాధించి తృతీయ స్థానం లో నిలిచారు. వీరిని ఉపాధ్యాయులు, అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా మండల విద్యాధికారి నిమ్మ రాజిరెడ్డి మాట్లాడుతూ మండలం లోని 13 ప్రభుత్వ పాఠశాల లలకు గాను 12 పాఠశాల లు 100శాతం ఉత్తీర్ణత సాధించాయని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉపాధ్యాయులకు మండల విద్యాశాఖ పక్షాన అభినందనలు తెలిపారు.
.
Aksharam Telugu Daily