Friday, 06 March 2026 03:04:45 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

జమాత్ ఇ ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం. *మట్టి చేతుల్లో- దేశ ప్రేమ హృదయాల్లో.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 20 July 2025 05:22 PM Views : 652

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/బూర్గంపహాడ్ : * భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/బూర్గంపాడు మండలం/సారపాక. అక్షరం న్యూస్/ జూలై 20: బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక గ్రామంలో జమాత్ ఇ ఇస్లామీ హింద్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం నాడు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు, ఈ సందర్భంగా జమాత్ ఇ ఇస్లామి హింద్ సభ్యులు మాట్లాడుతూ మట్టి చేతుల్లో దేశ ప్రేమ హృదయాల్లో అనే నినాదంతో భారత దేశంలోని ప్రతి బిడ్డ ఒక చెట్టు నాటాలి అనే ముఖ్య ఉద్దేశంతో జమాత్ ఇ ఇస్లామీ హింద్ పిల్లలలో సృజనాత్మకతకై ఒక పెద్ద కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు, చిన్నారుల కోసం చిన్నారుల ద్వారా పెద్దల సంరక్షణలో నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా పిల్లలలో ఇస్లామిక్ విలువలతో పాటు దేశ ప్రేమ, దేశ సేవ ,సామాజిక విలువలతో పాటు చైతన్యం, నాయకత్వ లక్షణాలతో తీర్చిదిద్దాలన్నారు, పిల్లల అభివృద్ధే లక్ష్యంగా జే ఐ హెచ్ ఒక మహత్తర మిషను చేపట్టిందని "మట్టి చేతుల్లో.. దేశ ప్రేమ హృదయాల్లో " అనే నినాదం తో దేశవ్యాప్త ఉద్యమాన్ని జూన్ 25 నుంచి జూలై 25 వరకు ప్రారంభించిందని దీని లక్ష్యం 10 లక్షల మొక్కలు నాటి వాటి సంరక్షణా బాధ్యతలు చిన్నారులకు అప్పగించడంతో భారతదేశాన్ని ఆకుపచ్చగా ఆహ్లాదకరంగా మార్చడం మరియు చెట్లను జాగ్రత్తగా చూసుకోవడం వలన ప్రకృతి పట్ల ప్రేమ పర్యావరణ సేవ బాధ్యత బాల్యము నుండే వెలువడాలని ఈ ఉద్యమం ముఖ్య ఉద్దేశం అన్నారు భూమిపై మంచి పౌరులుగా ఉండటానికి ఇది మనకు మంచి అవకాశం ఈ కార్యక్రమం చేయడానికి గల కారణం, భూమి వేడెక్కతోంది చెట్లు నరకటం వలన అడవులు తగ్గి స్వచ్ఛమైన గాలి వీచడం లేదు చెట్లు నాటడం ద్వారా మన పిల్లలు భవిష్యత్తుకు కూడా సహాయం చేయగలరని జే ఐ హెచ్ నమ్ముతుంది. ఈ ఉద్యమంలో మనం మన పాఠశాల తోపాటు ఇంటి దగ్గర కూడా ఒక చెట్టును నాటాలన్నారు మొక్కలు చెట్ల ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు పిల్లలకు వివరించారు మనిషి ఈ ధరిత్రిపై అడుగు పెట్టకముందే ఆ దైవం ఈ ప్రపంచాన్ని ఎన్నో రకాల వృక్ష జాతులతో అలంకరించాడు. మరికాసేపట్లో ఈ ప్రపంచం అంతమైపోతుంది అని తెలిసినప్పటికీ మీ చేతిలో మొక్క ఉండే దానిని నాటండని అన్నారు. నీడవెచ్చే చెట్ల క్రింద మలమూత్రాలు చేయడాన్ని ప్రకర్ష ప్రవక్త తీవ్రంగా ఖండిం చారని అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఐటిసి పిఎస్పిడి మహిళా వైద్యాధికారి అమృత జమాత్ ఇ ఇస్లామీ హింద్ మహిళా సభ్యులు రుబినా,మస్రత్ , రఫత్,వాసిఫా,పర్వీన్,రజియా బేగం,హాజీ బేగం,తస్లీమా భాను, సఫియా,కరిష్మా మరియు జమాత్ ఇ ఇస్లామి హింద్ సారపాక సభ్యులు జహీర్ పాషా, షేక్ అబ్దుల్ సలీం,జహూర్ పాషా,సైదుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :